స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Thursday, April 22, 2010

వానర సేవ !


పక్క మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో.....మన కెందుకు ఈ పీడ అని పలాయన మంత్రం పఠించే ఈ రోజుల్లో....ఓ వానరం అందునా......పిల్ల తల్లి.....ఇద్దరు గుడ్డి మానవులకు సాయం చేస్తున్న వైనం చూస్తే.....మనసు ఆర్ధ్రత తో ద్రవిస్తుంది ......చూడండి !
ఇదేమీ కెమెరా మాయాజాలమూ కాదు......ఎక్కడో జరిగిందీ కాదు ! బెంగలూరు లో ఓ దేవాలయం లో జరిగింది. కుళాయి విప్పలేక సతమత మవుతున్న ఇద్దరు గుడ్డివాళ్లకు .....ఓ వానరం కుళాయి తిప్పి వాళ్ళు నీళ్ళు తాగింతర్వాత ....తనూ తాగి.....కుళాయి కట్టేసి మరీ.....ఎంచక్కా పోయింది. మనకు ....అదేనండి మనుషుల మనబడే మనకు బుద్ధి యెప్పుడొస్తుందో యేమో ?

Sunday, April 18, 2010

అయోమయం .................!


ఓ పక్క తండ్రి కాబోతున్నాననే ' గర్వం ' !
మరో పక్క ...ఇక నీ కౌగిలి లో చోటెక్కడిదనే ' భయం ' !
అంతా.............అయోమయం !







జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి , ముజ్జగాలు నీవే అన్నట్లు గడిపిన ఓ భర్త ...తను తండ్రి కాబోతున్నాడు అనే వార్తా తెలియగానే ఎలా స్పందించాడో చూడండి !
ఏ మగాడి కైనా తన మగతనపు ప్రతీక గా ఓ బిడ్డ ఈ భూమ్మీద జీవం దాలుస్తున్నదంటే..గర్వం తో కూడిన ఆనందం తో మీసం మెలేస్తాడు . అలాంటిది....ఎలా డీలా పడి , అయోమయం అంటూ వాపోయాడో గమనించారు కదూ !



చూసారా....... !తాత్కాలిక ఎడబాటు అయినా ఎంత విలవిల లాడి పోయాడో గమనిస్తే ' భర్త తనపు- భాంధవ్యాన్ని' అతను ఎంతగా ఆస్వాదించాడో మనం గుర్తించవచ్చు . అలాగే ఎప్పుడూ అమ్మ ప్రేమ గొప్పతనం గురించే చెప్తారు గానీ ' తండ్రి తనపు -తియ్యందనాన్ని ' ఎవరూ చూడరు . ఆ తియ్యన్దనాన్ని మనసారా చవిచూస్తూ , ఎడబాటు సంగతే మర్చిపోతాడు.ఆ ' అయోమయం' కాస్తా...'అయ్యా నీ మయం' అయిపోతుంది !


Saturday, April 10, 2010

రమ్యాతి రమ్యం !


రమ్యం ...........రమణీయం .......రమ్యాతి రమ్యం !
మనసు ....తనువూ.......ఒకోసారి రెండూ వేరు వేరు అనిపిస్తాయి ! ఒకోసారి రెండూ ....ఒకటే అనిపిస్తాయి ! స్పందించే మనసు ......దాన్ని గుర్తించే తనువూ వున్నపుడు రెండూ ఒకటే ! అది లేనపుడు ..... రెండు ఖచ్చితం గా వేర్వేరు ! ఇది నాకు ......ఇన్నేళ్ళకు తెలిసింది !
అందుకే ................గుండె గదిలో గూడు కట్టుకున్న '' అనుభూతుల - మధురోహ '' లను కదిలిస్తే ......అవి 'రమ్యం......రమణీయం .........రమ్యాతి రమ్యం '' ! తలపుల తాకిడి కి మది పొందే ఆనందం వర్ణ ననాతీతం ......... మరియు అనుభవైద్యేకం మాత్రమే ! తరంగ దైర్ఘ్యాన్ని గుర్తించే వాళ్ళ కోసమే ............రమ్యాతి రమ్యం !