అవధుల్లేని సంతోషాన్ని
అందరికీ పంచాలని
అవనికి వెలుగివ్వాలని
అర్పణ గా తన శరీరాన్ని అందించి
అణువణువున కరుణరసం
అనయము కురిపించి
అంతః కరణంలోజ్ఞాన చక్షువులు తెరిపించాలని
అవని పూతోటన విశ్వశాంతి గుబాళించాలని
అభిలషించిన ...ఆ కరుణమూర్తి...దివ్వెగా తిరిగి
(క్రైస్తవ సొదరీ-సోదరుల అందరికీ ......ప్రేమతో అంకితం ).