స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Sunday, March 30, 2025

SARVARI !

శార్వరి!

   ఓ 5 సంవత్సరాల క్రితం …ఆ పేరు ఎవరికీ తెలియదు, కొంతమందికి తప్ప. శార్వరీ నామ సంవత్సర పున్నెమా అని ఆ పేరు వెలుగులోకి వచ్చింది. మా మాతాపితరుల నలుగురి సంతానం లో చివరి కళత్రం తను . చివరిదైనందున గారాబంగా పెరగడం అటుంచి..అన్ని కష్టాలను అనుభవించి, ఆటుపోట్లను చవిచూచి , ఎదుర్కొని నిలిచిన ధీశాలి.


ఇంజనీర్లగా తన సంతానాన్ని చూసుకోవాలన్న మా నాన్నగారి తీవ్ర అకాంక్షలకు ( కాటన్ మహాశయుడిని ..దుమ్ముగూడెం ఆనకట్ట నిర్మాణం సమయంలో కళ్ళారా చూస్తూ ప్రభావితమై పెరిగి ..పరిస్థితుల వల్ల ఇంజనీరు కాలేకపోయినాయన)…ఏకైక ప్రతినిధిగా నిలిచిన బుద్ధిశాలి..తనే!ఎందుకంటే మేమందరం బై.పీ.సీ తీసుకొని ఆయన ఆశలపై నీళ్లు చల్లిన వాళ్లమే!



     అలా నాన్నగారి ఒత్తిడి ఒకవైపు..కొన్ని కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్రమైన క్రమశిక్షణలో పెంచిన అమ్మ ప్రేమ కాఠిన్యం ఓవైపు …తనను దావానలంగా తాకినా …శిల్పిలా తనను తాను చెక్కుకుని జీవితంలో స్థిరపడిన మూర్తి మత్వం తనది.


 

    చదువుకునే రోజుల్లోనే అమ్మానాన్నలు స్థిరపరిచిన మనువును ఖాయం మాత్రమే చేసుకుని, ఇరువురి ఇంజనీరింగ్ చదువులు పూర్తిచేసుకున్న తర్వాతనే సహృదయుడైన గొంది. వెంకటరాములు /వెంకటరమణ గారిని మనువాడిన ఓ సగటు మధ్యతరగతి మహిళామూర్తి తను!




    తను పెరిగిన వాతావరణం ప్రభావం తన ఇద్దరాడపిల్లలపై పడకుండా, కటువుగా వుందేమో అని పైకి అనిపించేలా మాత్రమే కనిపించి ..క్రమశిక్షణతో వారిని ప్రయోజకుల్ని చేసిన సప్రేమ మాతృమూర్తి తను !





 యువతిగా,ఆడపడుచుగా,భార్యగా,తల్లిగా , ఓ వియ్యపురాలిగా వివిధ దశల్లో, ఆ దశలకు అణుగుణంగా సమర్థవంతంగా మెలుగుతూ…తను ఇవన్నీ సాధించింది..ఓ ఉద్యోగిని గా ..అదీ నిరంతరం వివిధ ప్రదేశాలలో తిరుగుతూ నిర్వర్తించాల్సి వచ్చిన క్లిష్టమైన బాధ్యతలుండే ఉద్యోగినిగా!



ఇన్ని కష్టాల , ఇన్ని శ్రమలకోర్చిన ఫలితమే నేడు తను కేంద్ర రంగ సంస్థ అయిన E.C.I.L కు General Manager అయ్యింది. అదీ తన పుట్టినరోజు నాడున…అదీ ఉగాది పండగ రోజున.

 
Yes ….She is my sister SARVARI. The General Manager of E.C.I.L. 

       

I am proud brother of Her. I wish …Many many happy returns of this summative day of Promotion, Festival and Bithday.


  Happy birthday to you …Sari!😊💖🙌💦🎊👍🎉!

16 comments:

  1. Absolutely beautiful narration of a beautiful journey <3 _ Megha, proud daughter of Sarvari Devi

    ReplyDelete
  2. ఉగాది రోజున ఉదయించి...ఉదయభానుని వలే ఉన్నత ఆశయాలతో.... ఎదిగి...తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన...మా మాస్టారుగారి ముద్దుల చెల్లెలు శ్రావణీ మేడం గారికి ఉగాది రోజున పుట్టిన రోజు శుభాకాంక్షలు...🎉🎊🍬🌾💐🎂🍭💐👏👏👏🍁🍃🙏🍃🍁🕊️🕊️🕊️🌿🌾

    ReplyDelete
  3. Congratulations, super woman

    ReplyDelete
  4. Wonderful !! Congratulations 💐💐
    & Many More Happy Returns Of The Day !
    Happy Birthday !! God bless Always 💐🎂🙏🏻

    ReplyDelete
  5. Congratulations To Sarvari On Your Promotion & Made Your Family Proud 👏

    ReplyDelete
  6. ఉగాది రోజున ఉదయించి...ఉదయభానుని వలే ఉన్నత ఆశయాలతో.... ఎదిగి...తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన. ముద్దుల చెల్లెలు శ్రావణీకి ఉగాది రోజున పుట్టిన రోజు శుభాకాంక్షలు...🎉🎊🍬🌾💐🎂🍭💐👏👏👏🍁🍃🙏🍃🍁🕊️🕊️🕊️🌿🌾

    ReplyDelete
  7. ఉగాది రోజున ఉదయించి...ఉదయభానుని వలే ఉన్నత ఆశయాలతో.... ఎదిగి...తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన. ముద్దుల చెల్లెలు శ్రావణీకి ఉగాది రోజున పుట్టిన రోజు శుభాకాంక్షలు...🎉🎊
    A.లోకేశ్వర్ రావు

    ReplyDelete
  8. ముద్దుల చెల్లి మీద ఎంత ప్రేమో మా రమణ కు. నిజంగా కుటుంబ బాధ్యతలతో, తండ్రి ఆశయం కోసం ఈ స్థాయికి ఎదగటం మామూలు విషయం కాదు. శ్రావణి కి అభినందనలు

    ReplyDelete